Wednesday, July 2, 2014

ఆఖరి మజిలి అయితే ?

                                                              ఆఖరి మజిలి అయితే  ?నా జేవితపు ఆఖరి మజిలి గొప్ప మజిలి అయితే ...... నా తెల్లని పుస్తకం లాంటి ఈ పయనం లో మిగిలినవి 

కొన్ని నలుపు సిరా గుర్తులు 
కొన్ని ఎరుపుసిర గుర్తులు 
కొన్ని అర్థం లేని మచ్చలు 

మనస్సు పెట్టి గీసిన  వర్ణ చిత్రలితే కొన్నితే 
మనస్సు బట్టి గీసిన సాక్షాలు కొన్ని 


ఆటుపోట్లు లేని తటాకం కాదు, నా ప్రయాణం నిత్యం అలలతో సహచర్యం నా జీవితం అందంగా తీర్చిదిద్దిన చిత్రం కాదు అస్తవ్యస్తంగా అద్దిన రంగు 

నా  రాగం వాన కాలం లో కోకిల పాట కాదు నిశీధిలో  తీతువు గీతం 


నన్ను చేరినది చల్లని చిరుగాలి కాదు భయంకర నిశబ్ద తూఫాను 

నేను గల గలా పారే గోదారిని కాను లోతెంతో తెలియని మౌన సముద్రాన్ని 

                                                                                                                                         ఓం సాయి రామ్ 
Friday, May 9, 2014

                                                                     ఎప్పుడొస్తావు ............ 

నా ప్రియమైన సహచర్యమా ,

                   ఎప్పుడొస్తావు ......... 

               చల్లని పిల్లగాలి తిమ్మెర లా ..... 

                వేణువు  నాదం లా ............. 

                నన్ను గుండెలకు ప్రేమగా హత్తుకునే నేస్తమా నీ  ఆగమనం ఎప్పుడు 

               నీ కోసమే ఈ ఎదురుచూపు 
  
               ఎలా ఉంటావు నువ్వు ... 

నన్ను నీ పథం లోకి ఎప్పుడు తీసకేళతావు  .. 

 వసంత కాలం లో తీయని కోయిల గళాన్ని ఆస్వాదిస్తూ కమ్మని కబుర్లు చెప్పుకునేదేప్పుడు ... 

ఎ భయం లేకుండా నీ హృదయం పై నిదురించేదేప్పుడు ....... 

నీ మాటే నా మాట గా నీ బాటే నా బాటగా ప్రయాణించేదెప్పుడు ....... 

నా అనే నా చిరునామా నువ్వు 

శూన్యమైన  నా జీవితానికి అర్థానివి   నువ్వు'

నీతో కలిసి జీవించాలని ఎంతో ఆశ తో  ఎదురుచూస్తున్న నీ చరణ దాసిని 

జీవనం ఒక అందమైన గీతం అయితే అందులోని పల్లవి నీ రాకతోనే మొదలవుతుంది 
...........

నీ కుటుంబం నా కుటుంబం మన కుటుంబంగా మారాలి .....

నా తుది శ్వాస నీ ఒడిలోనే ఆనందంగా విడువాలని అశిస్తూ  ...............

నా ప్రేమా ఎప్పుడొస్తావు ..................... ...............\................ 


                                                                                       ఓం సాయి రామ్ 

Wednesday, March 12, 2014

గీతం

                                                                          గీతం ఎన్నాళ్ళనుంచో నా హృదయ గీతాన్ని ఆవిష్కరించాలని ఆశ కాని ఆ గీతాన్ని మ్రోగించ గలిగే  వేణువు నీవే అని తెలిసింది 

అమృత గళం నుంచి జాలువారిన తీయని తేనెలా నన్ను కదిలించావు .....  మెల్లగా మ్రీటిన తంతి పై నన్ను పలికించావు .......... 

ఇన్నాళ్లు చూసినా నా జీవితానికి అర్థాన్నిచ్చావు .............  నీ పలుకులతో నన్ను పరవశిం ప  చేసావు ........... 
అదే విధంగా నన్ను ముగాబోయించావు ............ 

ఎందరిలో అయినా నీ శ్వాశ పలకరింపు చాలు నిన్ను పొల్చుకొగలను కాని నీవు నా హృదయ  గీతాన్ని ఎప్పటికి అర్థం చేసుకుంటావు ..... 

మూగగా రోదిస్తున్న నా హృదయ  వాణి  నీకు వినిపించలేదా 
ఎల్లప్పుడూ నీ తలపులనే తలచుకునే నా ఉహ నిన్ను స్ప్రుశించాలేదా ........... 
నిద్రలో కూడా నిన్నే తలచే నా ప్రేమను  గుర్తించలేదా .............. 

మనసునిండా ప్రేమతో నిను చూసే చూపు నిన్ను   తాకలేదా ............. 

 ఎక్కడ ఉన్న నిన్నే వెదకే నా ప్రణయం నీకు అర్థం కాలేదా.... 

నాకీ  నేను చెప్పలేని దుస్థితి మరి నా హృదయ స్పందన నీవైతే నేకిది తెలియలేదా .............. 

ఎం చెయ్యలేని నిస్సహాయురాలిని బాబా కాపాడు 

నిన్ను చూస్తూ  మాట్లాడలేని నా ఈ ఒక్కో క్షణం నన్ను   స్థిమితంగా ఉండనీ యటం  లేదు ................ 
ఆకాశం నుండి జారే ఝరి లా నువ్వు నా కోసం వస్తావని ఆకాంక్షిస్తూ  ఆశతో ..... 

నిన్ను కలిసే క్షణాల కోసం ఎంతో ప్రేమతో ఎదురుచూస్తూ ............... 

ఎప్పటి కైనా కలుస్తావని ఆశతో .... నీ పై అంతులేని ప్రేమతో ........... 


ఎప్పటికీ నీ  అనే నేను ...  


Wednesday, March 5, 2014

ఆకాంక్ష

                                                                                  ఆకాంక్ష 


ఎందుకు జీవితం ఇన్ని పరిక్షలనిస్తోంది 
అమ్మ కడుపులో జీవం కోసం పరీక్ష 
పుట్టాక మనుగడ కోసం పరీక్ష 

ఆడపిల్లగా పుట్టడటం ఒక వరం కాని ఈ అర్థం కాని భయాలు ఎందుకు మమ్మల్ని  ఉండనివ్వవు నేను నా అనే ఉనికిని కోల్పోయి జీవిన్చాలేకునాను . నాకు నేను అనే గుర్తింపు కావలి నాకి బ్రతికే వారు కావలి ఎందుకీ తెలెయని బాధ ఏడుపు నాకు ఆనందంగా ఉండాలని ఉంది బంధాల కోసం ప్రకులడడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు అందమైన బంధాలను బందీగా అనుకునే ఈ రోజుల్లో నా అనే ఒక బంధం కోసం నా ఆకాంక్ష ....................