Thursday, February 16, 2012


ఎందుకు నాకే ఇలా జరుగుతోంది . నిజాయతీ, న్యాయం, ప్రేమ ఉండడం తప్పా. ఎందుకు ఈ అసహనం. అర్థం కాని బాధ. బహుశా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు కలిగే భావన అనుకుంటా. నేను ప్రేమించా కానీ ఎందుకు చెప్పలేకపోతున్నా. మొదటిసారిగా  సలహాలివ్వడం తేలిక కాని నిజాన్ని ఎదుర్కోవడమే కష్టం అని అర్థం అవుతోంది.
నిజమే నేను ఎంతో ఇష్టపడి, కష్టపడి చదివా కానీ ఎందుకు నేను ఇంకాస్త జాగ్రతగా చదివి మొదట రాలేకపోతున్నా. లేదు వస్తా కష్టపడే తత్వానికి ఓటమి ఉండదు. భగవంతుడు మేలైనది ఇవ్వడానికే ఇప్పుడు ఇది అనుగ్రహించాదేమో అవును నిజం .   కచ్చితంగా నా గమ్యాన్ని చేరుకుంటా.
కాని చిన్న వేలతి ఏమిటంటే నా ప్రేమ ఎప్పటికీ ఒక వైపే నాకు తనతో కలిసే జీవించే అవకాశం లేదేమో ఎందుకంటే నా ప్రేమని నేనేప్ప్పటికి చెప్పలేను. బాధగా ఉన్న ఇది నిజం నన్ను నేను ఒడార్చుకోవడానికి రాస్తున్న నిజం.




Thursday, February 9, 2012

కొన్ని సార్లు మాట్లాడే మాటలకన్న చిన్ని చిరునవ్వు ,మౌనమే గొప్ప సమదానమేమో .




నా ఈ జీవన ప్రయాణం లో ఒంటరినన్న భావన కలుగుతోంది .

LOVE

ప్రేమ . 

ఎలా వివరించాలో తెలియని ఎవరికీ వారె తెలుసుకోగలిగిన గొప్ప అనుభూతి . ఇష్టాన్ని వ్యక్తపరచాడమేనా ప్రేమంటే . కలిసి ఉండడం , కోట్లాడటం, ఎదుటివారి ఇష్టాన్ని వ్యతిరేకించడం, బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడటం ఇంతేనా అప్పుడు మనసుకి మరబోమ్మకి తేడా ఏంటి . 


దూరంగా  ఉన్నా మనసులో దగర్రగా ఉండటమే ప్రేమ .
ప్రేమించిన వారి చిరునవ్వు కోసం జీవితమంతా ఎదురుచుడటమే ప్రేమ .
ఎదుటివారి నుంచి ఎం ఆశించకుండా పంచేదే ప్రేమ.
ఎందుకు ప్రేమిస్తామో చెప్పలేము అది ప్రేమించే హృదయానికే అర్థముతుంది నిజమైన ప్రేమకు భాష అవసరం లేదు ప్రేమ నిజమైనప్పుడు అది ప్రేమించేవారికి తప్పక చేరుతుంది అలంటి ప్రేమ ఎప్పటికి గెలుస్తుంది .
అలంటి నిజమిన ప్రేమ కోసం ఎల్లపుడు ఆకాంక్షిస్తూ ..........................................................
                                       
                                                                                       ప్రేమ .