Monday, November 28, 2011

aasha aasha aasha..................


సంధ్య సమయం మించుతున వేళ సూర్యుడు ముఖం మీద దుప్పటి కప్పుకుంటుంటే చంద్రుడు తనను నిద్ర లేపుతున్న చీకటిని విసుక్కుంటున్న దృశ్యం తమ నేస్తమిన సూర్యుడితో పగలంతా ఆటలాడి అలసిపోయిన పుష్పాలు ఆకులూ చంద్రుడి రాక  తో చీకటి తమను బజ్జోపెడుతుండగా చెట్లు తమ ఆకులను ముడుచుకుంటూ బుద్ధిగా నిదరోతున్న తీయని దృశ్యం .



హవ్వ! అపుడే నిద్రేంటి అని గాలి మామయ్య ఆటలు ఆడించడానికి వస్తున్న మామయ్యను పలుకరించి బజ్జుంటా మామయ్యా అని నిద్రకు ఉపక్రామిస్తుంటే చీకటి తన రెక్కలను ఇంకా విశాలపరుస్తూ తన రెక్కలని దుప్పటిలా చెట్లకు కప్పింది .





అప్పుడే ఆహారంతో గూటికి చేరి తన చిన్ని గువ్వపిల్లను ముద్దాడి బువ్వ పెట్టి బజ్జోపెట్టిన తల్లి గువ్వ తను ఆహరం సంపాదించడం కోసం పడిన శ్రమంతా మరచిపోయింది ఆహారపు వేటలో తనకు తగిలిన ఎదురు దెబ్బలు తన బిడ్డలా ముద్దుమోము చూచి మరచి మురిసిపోయింది .
















ఇంత అందమైన సాయింత్రాన్ని అందరూ అస్వాదిస్తునారు ఒక్కడు తప్ప ఈ ప్రపంచంలో ఇన్ని అందాలూ అందాలూ ఉన్నాయన్న ఆలోచన కూడా వాడి మదిలో మెదలలేదు వాడికి కంటినిండా నిదుర ఉంటె కదా చీకటిని పలుకరించి భావుకత నింపడానికి తన మదిలో . బొజ్జ నిండా బువ్వ ఉంటె కదా చల్లని చంద్రయ్య తో నేస్తం చేయడానికి శరీరాన్ని రక్షించడానికి గుడ్డలుంటేనే కదా గాలి పిలుపును విని ఆస్వాదించడానికి అ గాలి మామయ్య పిలుపును పట్టించుకోవడానికి వాడి ఆలోచన మనసు వాడి దగ్గర లేవు . ఆకలి , దరిద్రం ,సమస్యలు వీటి చుట్టూనే వీడి ఆలోచనలు ఇవే వాడి నేస్తాలు డబ్బు ఇదే వాడి ఆశ . దౌర్జన్యాలకు బలవుతు మగ్గిపోతున్న అమాయకుడు వాడు . ఆదరించే వారులేక చీదరింపులతో బతుకు వెళ్ళదీస్తున హరిపుత్రుడు వాడు నిజమిన మనవ సమాజం కోసం ఎదురుచూస్తున్న ఆశావాది . అంటరానితనం ముసుగులో బాధలను అనుభవిస్తూ తన శ్రమను ఆయుధంగా చేసి రక్తాని చెమటల పిండి దేశానికి సేవ చేస్తున్న దేశభక్తుడు . వాడికి మంచి రోజులు వచిన్నపుడే నా దేశం సువర్ణ దేశంగా   మారుతుంది ఆనాడు నా దేశంలో ఆకలి చావులు , సంఘ విద్రోహకాలు , ఇలా ఏమి ఉండవు అప్పుడు నా దేశం నిజమిన మానవీయ విలువలు కలిగిన దేశంగా ఆనందాలు చిందే భూమి గా ఉంటుంది

అల్లాంటి రోజు కోసం ఆశతో ఎదురుచూస్తూ ............ఆశ ఆశ ఆశ